Jump to content

స్కోచ్ పురస్కారం

వికీపీడియా నుండి

స్కోచ్ పురస్కారం (ఆంగ్లం: SKOCH Award) స్కోచ్ గ్రూప్ అనే స్వతంత్ర సంస్థ అందించే పురస్కారం. భారతదేశంలో అత్యున్నతంగా భావించే ఈ పుస్కారాల ద్వారా పరిశ్రమల సారథులు, మేధావులు, సాంకేతిక నిపుణులు, మహిళా నాయకులు, అట్టడుగు స్థాయి కార్మికులు ఇలా అందరినీ ఎంపిక చేసి ప్రతియేటా సత్కరిస్తారు. స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్.

నేపథ్యం

[మార్చు]

భారతదేశాన్ని మెరుగైన దేశంగా మార్చడానికి కృషి చేసే వ్యక్తులు, ప్రాజెక్ట్‌లు, సంస్థలను స్కోచ్ గ్రూప్ గుర్తించి స్కోచ్ అవార్డు ద్వారా సత్కరిస్తుంది. ఈ స్వతంత్ర సంస్థ అందించే పురస్కారాలు దేశంలో అత్యున్నత పౌర గౌరవంగా అభిప్రాయపడతారు. ఇది 2003లో స్థాపించబడింది. ఇది డిజిటల్, ఫైనాన్షియల్, సోషల్ ఇన్‌క్లూజన్‌లో అత్యుత్తమ ప్రయత్నాలను కవర్ చేస్తుంది.

తెలుగు రాష్ట్రాలకు స్కోచ్ పురస్కారం

[మార్చు]
  • 2015లో స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు దక్కింది.[1]
  • గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫ్లాగ్‌షిప్ మిషన్ అయిన దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ (DAY-NULM), దాని పోర్టల్ ఫర్ అఫర్డబుల్ క్రెడిట్ అండ్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ యాక్సెస్ (పైసా) కోసం ప్రతిష్టాత్మకమైన స్కోచ్ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వరించింది.
  • 2018లో తెలంగాణ ప్రభుత్వంలోని భాషా సాంస్కృతిక శాఖ జూన్ 23న "మన కళ - మన గుర్తింపు" (Our Art - Our Identity)కోసం స్కోచ్ అవార్డు పొందింది. 2018లో, భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో 'మన కళ - మన గుర్తింపు' పేరుతో కళాకారులకు గుర్తింపు కార్డులను ఆన్‌లైన్‌లో అందించే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టినందుకు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డును అందించారు.
  • 2018లో ఎలెక్ట్రానిక్ పరిపాలనలో కృషికి గాను, స్కోచ్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ గెలుచుకుంది.[2]
  • 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు స్కోచ్ పురస్కారాలు వరించాయి. స్కోచ్‌ గ్రూప్‌ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో 2020-21కి గానూ ప్రకటించిన అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు గోల్డ్, సిల్వర్ స్కోచ్ లు వరించాయి. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాలతో పాటు మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్‌ ఆంధ్రా’కు డొమెస్టిక్‌ ఫిష్‌ మార్కెటింగ్‌ కేటగిరిలో గోల్డ్‌ స్కోచ్‌ వచ్చాయి. మత్స్యశాఖకు ఈ–ఫిష్‌ విభాగంలో,  పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్‌ యాప్‌కు, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌)కు, గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి, బయోవిలేజ్, నేచురల్‌ ఫార్మింగ్‌ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్‌ స్కోచ్‌ అవార్డులు దక్కాయి.[3]   ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ప్రభుత్వ భూముల వివరాలు తెలియజేసే ‘మీ భూమి’ పోర్టల్‌కు ఈ-గవర్నెన్స్‌ విభాగం కింద స్కోచ్‌ సంస్థ సిల్వర్‌ మెడల్‌ దక్కింది. కౌలుదారు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌), పేద కుటుంబాలకు ఇంటిస్థలాలు, భూశోధక్‌ డిజిటల్‌ ప్రాజెక్టులను ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు వరించాయి. స్కోచ్‌ సంస్థ 2022 ఏప్రిల్ మాసంలో నిర్వహించిన వెబినార్‌లో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఈ స్కోచ్‌ అవార్డులను స్వీకరించారు.[4]
  • 2022 డిసెంబరు 4న ఆన్‌లైను వేదికగా ఎక్కడైనా, ఎప్పుడైనా సేవల్లో రాష్ట్ర రవాణా శాఖ అత్యుత్తమ పనితీరుకు 2020-21 ఏడాదికిగానూ స్కోచ్‌ అవార్డు (సిల్వర్‌)ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పురస్కారం దక్కించుకుంది.[5]
  • తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ కు 2018 నుండి 2021 వరకు వరుసగా నాలుగు స్కోచ్ పురస్కారాలు దక్కాయి.[6]
  • హైదరాబాదు నగర పోలీసు శాఖకు 2022 డిసెంబరు 4న వర్చువల్‌ పద్ధతిలో జరిగిన స్కోచ్‌ సమ్మిట్‌-2021లో ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ పురస్కారం వరించింది. ప్రజామిత్ర పోలీసింగ్‌లో భాగంలో చేపట్టిన ‘ప్రీ-రిక్రూట్‌మెంట్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం’కు ‘పోలీస్‌, భద్రతా’ విభాగంలో ఈ అవార్డు దక్కింది.[7]

చిత్రమాలిక

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వంలోని భాషా సాంస్కృతిక శాఖ 2018 జూన్ 23న "మన కళ - మన గుర్తింపు" కోసం స్కోచ్ అవార్డు పొందింది.

మూలాలు

[మార్చు]
  1. "Skoch Order of Merit Award for TSPSC". The Hans India. 8 December 2015. Retrieved 14 September 2019.
  2. "సమాచార సాంకేతిక, ప్రసారాలశాఖ". Archived from the original on 2018-04-27. Retrieved 2010-11-29.
  3. "ఏపీకి 'స్కోచ్‌' అవార్డుల పంట". Sakshi. 2022-01-06. Retrieved 2022-01-07.
  4. "'మీ భూమి'కి స్కోచ్‌ అవార్డు". m.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-14. Retrieved 2022-04-14.
  5. "Skoch award 2021: హైదరాబాద్ పోలీసులకు 'స్కోచ్‌' పురస్కారం". ETV Bharat News. Retrieved 2022-01-07.
  6. "పురస్కారాలు". te.tstransco.in. Archived from the original on 2021-03-06. Retrieved 2022-01-11.
  7. "Skochaward2021:హైదరాబాద్ పోలీసులకు స్కోచ్ పురస్కారం". ETV Bharat News. Retrieved 2022-01-07.